Tuesday 23 October 2012

విరామ చిహ్నాలు.....


చదివేటప్పుడు, వ్రాసేటప్పుడు పదాల మధ్య, వాక్యాల మధ్య ఎక్కడ ఆపాలో, ఎక్కడ ఆగాలో, ఎలా అర్ధం చేసుకోవాలో తెలిపేవి విరామ చిహ్నాలు (Punctuation marks).

[మార్చు]చిహ్నాలు

  • బిందువు (Full Stop) : వాక్యం పూర్తయినప్పుడు, పూర్తి అయినట్లుగా సూచించడానికి బిందువు పెడతారు. దీని సూచిక (.).
  • వాక్యాంశ బిందువు (Comma) : చెప్పవలసిన అంశం ముగియనప్పుడు, అసమాపక క్రియలను వాడి వాక్యం వ్రాస్తున్నప్పుడు వాక్యాంశ బిందువు లేదా కామా ఉపయోగిస్తాము. దీని సూచిక (,).
  • అర్థ బిందువు (Semi Colon) : ఒక పెద్ద్ వాక్యములో భాగంగా ఉండే చిన్న వాక్యాల చివర అర్థ బిందువు వస్తుంది. దీని సూచిక (;).
  • న్యూన బిందువు (Colon) : వాక్యాలలో వరుసగా కొన్ని పదాల పట్టిక ఇచ్చుటకు ముందు న్యూన బిందువు ఉపయోగిస్తారు. దీని సూచిక (:).
  • అనుకరణ చిహ్నాలు (Quotation Marks) : ఒకరు అన్న మాట ఇంకొకరు చెప్పుచున్నప్పుడు, వేరే ఏదో ఒక గ్రంథం నుండి తీసిన వాక్యాలు చెప్పునప్పుడు అనుకరణ చిహ్నాలు వాడతాము. దీని సూచిక (" ").
  • ప్రశ్నార్థకము (Question Mark) : ఏదైనా విషయాన్ని గురిమ్చి ఎదుటి వారికి అడిగేటప్పుడు ఆ వాక్యం చివర ప్రశ్నార్థకం ఉపయోగిస్తారు. దీని సుచిక (?).
  • ఆశ్చర్యార్థకము (Exclamatory Mark) : ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని, భయాన్ని, వింతను, మెచ్చుకోలును తెలిపే పదాల చివర ఆశ్చర్యార్థకమును ఉపయోగిస్తాము. దీని సూచిక (!).
  • పొడవు గీత (EM Dash) : వాక్యంలో వచ్చే విషయాలు వివరణ ఇచ్చేటప్పుడు పొడవు గీత వాడతాము. దీని సూచిక (-).
  • కుండలీకరణము (Bracket) : భాషా పదాల వివరణ నిచ్చుటకు, ఇతర నామాలు తెలుపుటకు, వివరణ నిచ్చుటకు కుండలీకరనములను ఉపయోగిస్తారు. దీని సూచిక ({ }).
  • మూడు చుక్కలు : చెప్పవలసిన మాటలు లోపించినప్పుడు అక్కడ ఏవో మాటలున్నాయని సూచించడానికి గాఉ ఈ మూడు చుక్కలను ఉపయోగిస్తారు. దీని సూచిక (...).

No comments:

Post a Comment