Tuesday 23 October 2012

సమాసములు


సమాసములు వేరు వేరు అర్థములు గల పదములు ఒకే అర్థమిచ్చునట్లు ఏకమగుట సమాసము. సాధారణముగా సమాసమున రెండు పదములుండును. మొదటి పదమును పూర్వపదమనియు, రెండవ పదమూ ఉత్తరపదమనియు అందురు.

[మార్చు]సమాసాలలోని రకాలు

  • అవ్యయీభావ సమాసము: సమాసము నందలి రెండు పదములలో మొదటి పదము అవ్యయముగాను, రెండవ పదము విశేష్యముగాను ఉండును. సమాసము నందలి రెండు పదములలో మొదటి పదము క్రియతో అన్వయించును. అనగా పూర్వ పదము యొక్క అర్ధము ప్రధానముగా కలది. పూర్వ పదార్ధ ప్రధానము. అవ్యయీభావ సమాసము
    ఉదా: యధాక్రమము - క్రమము ననుసరించి
  • ద్విగు సమాసము: సంఖ్యా పూర్వము ద్విగువు, సంఖ్యావాచక విశేషణముతో విశేష్యము సమసించినచో అది ద్విగువగును. ఇందు సంఖ్యా వాచక విశేషణమే పూర్వమందుండును.
    ఉదా: మూడు లోకములు - మూడు అయిన లోకములు.

  • సమాహార ద్విగు సమాసము: ద్విగు సమాసము నందలి పదము సముదాయార్ధమును చెప్పినచో అది సమాహార ద్విగు సమాసమగును.
    ఉదా: పంచపాత్ర - ఐదు లోహములతో చేయబడిన పాత్ర

  • విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము: సమాసము నందలి పూర్వపదము విశేషణముగాను, ఉత్తరపదము విశేష్యముగాను ఉండును.
    ఉదా: మధుర వచనము - మధురమైన వచనము

  • విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము: సమాసము నందలి పూర్వపదము విశేష్యముగాను, ఉత్తరపదము విశేషణము గాను ఉండును.
    ఉదా: వృక్షరాజము - శ్రేష్ఠమైన వృక్షము

  • విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసము: సమాసము నందలి పూర్వోత్తర పదములు రెండును విశేషణములుగా నుండును.
    ఉదా: సరస మధురము - సరసమును, మధురమును

  • ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము: సమాసము నందలి పూర్వపదము ఉపమానపదమై, రెండవ పదము ఉపమేయ పదమగును.
    ఉదా: బింబోష్ఠము - బింబము వంటి ఓష్ఠము

  • ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసము: సమాసము నందలి పూర్వపదము ఉపమేయపదమై, రెండవ పదము ఉపమాన పదమగును.
    ఉదా: హస్త పద్మము - పద్మము వంటి హస్తము.

  • అవధారణ పూర్వపద కర్మధారయ సమాసము: దీనికి రూపక సమాసమని మరియొక పేరుగలదు. సమాసమునందలి రెండు పదములలో రెండవ పదము ఉపమానముగానుండును. ఉపమానము యొక్క ధర్మమును ఉపమేయము నందారోపించుటను రూపకమందురు.
    ఉదా: విద్యా ధనము - విద్య అనెడి ధనము

  • సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము: సంభావనమనగా సంబోధనము, గుర్తు అను అర్ధములు కలవు. సమాసము నందలి పూర్వపదము సంజ్ఞావాచకముగాను, ఉత్తరపదము జాతి వాచకముగాను ఉన్నచో అది సంభావనా పూర్వపద కర్మధారయ సమాసమగును.
    ఉదా: ద్వారకా నగరము - ద్వారక అను పేరుగల నగరము.

  • నఞ్ తత్పురుష సమాసము: అబావార్ధమును తెలియజేయును. ఇందలి రెండు పదములలో పూర్వపదము అభావమును తెల్పును. ఇచ్చట వ్యతిరేకార్ధము నిచ్చు 'న' వర్ణము వచ్చును. ఈ 'న' వర్ణమునకు హల్లు పరమగునపుడు న - 'అ' గా మారును. అచ్చు పరమగునపుడు 'అన్' గా మారును.
    ఉదా: న + ఉచితము - అనుచితము

  • ద్వంద్వ సమాసము: ఉభయ పదార్ధ ప్రధానము ద్వంద్వము. అనగా సమాసము నందలి రెండు పదముల అర్ధములను ప్రధానముగా గలది. ఇచ్చట రెండు పదములను క్రియతో అన్వయించును.
    ఉదా: రావణ కుంభకర్ణులు - రావణుడు, కుంభకర్ణుడు.

  • బహుపద ద్వంద్వ సమాసము: రెండు కంటెను ఎక్కువ పదములతో ఏర్పడిన సమాసమును బహు పద ద్వంద్వ సమాసమంటారు.
    ఉదా: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు - రాముడు, లక్ష్మనుడు, భరతుడు, శత్రుఘ్నుడు.

  • బహువ్రీహి సమాసము: అన్య పదార్ధ ప్రధానము బహువ్రీహి అనగా సమాసము నందలి పదములు అర్ధము కాక, ఆ రెండింటికంటె భిన్నమైన మఱియొక పదము ప్రధానముగ కలది. ఇందు సమాసము నందలి రెండు పదములలో ఒక పదమును క్రియతో అన్వయింపదు.
    ఉదా: చంద్రుడు - చల్లనైన కిరణములు కలిగినవాడు.

[మార్చు]తెలుగు సమాసాలు

తెలుగు పదమువిగ్రహ వాక్యంసమాసము
అనంతంఅంతం లేనిదినఞ తత్పురుష సమాసం
అర్ధరాత్రిరాత్రి యొక్క అర్ధభాగముప్రథమా తత్పురుష సమాసం
అసాధ్యముసాధ్యము కానిదినఞ తత్పురుష సమాసం
ఆలుమగలుఆలును మగడునుద్వంద్వ సమాసం
ఊతపదాలుఊతం కొరకు పదాలుచతుర్థీ తత్పురుష సమాసం
కంటినీరుకంటి యందలి నీరుసప్తమీ తత్పురుష సమాసం
కనకాభిషేకముకనకముతో అభిషేకముతృతీయా తత్పురుష సమాసం
కుటీరపరిశ్రమకుటీరము నందలి పరిశ్రమసప్తమీ తత్పురుష సమాసం
కులవృత్తులుకులము యొక్క వృత్తులుషష్ఠీ తత్పురుష సమాసం
కూరగాయలుకూరయు, కాయయుద్వంద్వ సమాసం
గంగానదిగంగ అను పేరుగల నదిసంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
గృహప్రవేశముగృహమునందు ప్రవేశముసప్తమీ తత్పురుష సమాసం
చంద్రుడుచల్లనైన కిరణములు కలిగినవాడుబహువ్రీహి సమాసం
చతుర్ముఖుడునాలుగు ముఖములు కలవాడుబహువ్రీహి సమాసం
చిరునవ్వుచిన్నదైన నవ్వువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
తల్లిదండ్రులుతల్లియును తండ్రియునుద్వంద్వ సమాసం
త్రికరణాలుత్రి (మూడు) సంఖ్యగల కరణాలుద్విగు సమాసం
తెలుగుభాషతెలుగు అను పేరుగల భాషసంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
దీపావళిదీపముల యొక్క ఆవళిషష్ఠీ తత్పురుష సమాసం
దేశద్రోహులుదేశమునకు ద్రోహులుషష్ఠీ తత్పురుష సమాసం
నరసింహుడుసింహము వంటి నరుడుఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం
నల్లకలువనల్లనయిన కలువవిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
నవరసాలునవ (తొమ్మిది) సంఖ్యగల రసాలుద్విగు సమాసం
పరోపకారముపరులకు ఉపకారముషష్ఠీ తత్పురుష సమాసం
పార్వతీపరమేశ్వరులుపార్వతియును పరమేశ్వరుడునుద్వంద్వ సమాసం
పినాకపాణిపినాకము పాణియందు కలవాడుబహువ్రీహి సమాసం
పుట్టినిల్లుపుట్టినట్టి ఇల్లువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
పురుషోత్తముడుపురుషుల యందు ఉత్తముడుసప్తమీ తత్పురుష సమాసం
పెనుతుఫానుపెద్దదైన తుఫానువిశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
భూగర్భంభూమి యొక్క గర్భంషష్ఠీ తత్పురుష సమాసం
భూలోకముభూమి అనే పేరుగల లోకముసంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
మధ్యాహ్నంఅహ్నం మధ్యభాగంప్రథమా తత్పురుష సమాసం
మనోవాక్కాయములుమనస్సును, వాక్కును, కాయమునుబహుపద ద్వంద్వ సమాసం
మానస సరోవరముమానస అను పేరుగల సరోవరముసంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
ముందడుగుముందుకు అడుగుషష్ఠీ తత్పురుష సమాసం
ముక్కంటిమూడు కన్నులు కలవాడుబహువ్రీహి సమాసం
ముల్లోకములుమూడు అయిన లోకములుద్విగు సమాసం
మేఘచ్ఛాయమేఘము వంటి ఛాయఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం
రక్తపుపోటురక్తము యొక్క పోటుషష్ఠీ తత్పురుష సమాసం
రామలక్ష్మణులురాముడును లక్ష్మణుడునుద్వంద్వ సమాసం
వయోవృద్ధులువయస్సు చేత వృద్ధులుతృతీయా తత్పురుష సమాసం
వాణిజ్యపంటలువాణిజ్యము కొరకు పంటలుచతుర్థీ తత్పురుష సమాసం
విద్యాధనమువిద్య అనెడి ధనముఅవధారణ పూర్వపద కర్మధారయ సమాసం
వేదాంగాలువేదాల యొక్క అంగాలుషష్ఠీ తత్పురుష సమాసం
శస్త్రచికిత్సశస్త్రముచే చికిత్సతృతీయా తత్పురుష సమాసం
సప్తాహాలుసప్త (ఏడు) సంఖ్యగల అహాలుద్విగు సమాసం
సముద్రతీరముసముద్రము యొక్క తీరముషష్ఠీ తత్పురుష సమాసం

No comments:

Post a Comment